ఓటీటీలో వినిపించేది అప్పుడేనా!

ఆది పినిశెట్టి హీరోగా నటించిన తాజా సినిమా ‘శబ్దం’ ఇటీవల విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. హార్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు అరివళగన్ వెంకటాచలం డైరెక్ట్ చేశారు. గతంలో వీరి కాంబోలో ‘వైశాలి’ సినిమా రాగా, అది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌ సొంతం చేసుకుంది. దీంతో ‘శబ్దం’ మూవీపై కూడా సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఫిబ్రవరి 28న విడుదలైన ఈ  సినిమా నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేశారు. మరి ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories