కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే పాన్ ఇండియా లెవెల్లో మరింతమంది స్టార్ హీరోస్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో స్టార్ నటి పూజా హెగ్డే కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి పూజా హెగ్డే అసలు ఈ సినిమాలో ఎలా కనిపిస్తుంది అనేది ఇపుడు రివీల్ అయ్యింది.
ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూలీ సినిమాలో కేవలం ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తాను అన్నట్టుగా తెలిపింది. అయితే రజినీ నుంచి రీసెంట్ గా వచ్చిన జైలర్ లో తమన్నాపై కావాలయ్యా సాంగ్ కి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ పూజా తెలిపింది. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.