ఆ రూమార్‌ నిజమా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. అయితే దీనిపై చాలా కామెంట్స్ ఉన్నాయి కానీ ఫైనల్ గా మాత్రం బాక్సాఫీస్ పరంగా సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక నెక్స్ట్ అంతా డైరెక్టర్‌ బుచ్చిబాబు సానాతో సినిమా కోసమే అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాపై మొదటి నుంచి సాలిడ్ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. రెహమాన్ ని పట్టుకోవడం ఇంకా చాలా మంది స్టార్స్ ఈ సినిమా కోసం ఓ రేంజ్ హైప్ ఇవ్వడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా గా ఈ సినిమాపై ఓ క్రేజీ రూమర్ వినపడుతుంది. దీంతో బహుశా ఈ సినిమా ఈ ఏడాది లోనే వచ్చేస్తుంది అంటూ టాక్ వినపడుతుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా పక్కా ప్లానింగ్ గా షూట్ చేసేసి ఈ ఏడాది చివరికి ముందే రావచ్చని కొత్త టాక్. మరి ఇది ఎంత వరకు నిజం అనేది వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories