అదేనా!

అదేనా! టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “రాబిన్ హుడ్”. మరి ఎప్పుడు నుంచో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఎట్టకేలకి ఈ మార్చ్ లో మేకర్స్ రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమా తోనే వార్నర్ ఇండియన్ సినిమాకి పరిచయం అవుతున్నారు. మరి వార్నర్ కూడా తన సినిమా ఎంట్రీపై మంచి ఎగ్జైటింగ్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే అసలు రాబిన్ హుడ్ లో వార్నర్ ఎలా ఏ పాత్రలో కనిపిస్తారు అనేది మంచి ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ ఇపుడు తన రోల్ పై కొంచెం క్లారిటీ తెలుస్తుంది. చాలా మంది తన రోల్ ఎంటర్టైనింగ్ గా కామెడీ రోల్ లా ఉంటుంది అనుకుంటున్నారు కానీ తన రోల్ మాత్రం ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. 

దర్శకుడు సహా నిర్మాణ సంస్థ కూడా వార్నర్ ని ‘భాయ్’ అంటూ సోషల్ మీడియాలో పిలుస్తున్నారు. సో తాను ఒక డాన్ లానో లేక మాఫియా గ్యాంగ్ స్టర్ లో కనిపిస్తారా అనేది మంచి ఆసక్తిగా మారింది. ఇక మొత్తానికి అయితే వార్నర్ రోల్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా ట్రైలర్ లేదా మార్చ్ 28 రిలీజ్ వరకు ఆగాల్సిందే. 

Related Posts

Comments

spot_img

Recent Stories