సరిపోదా శనివారం మూవీలో ఆ పాత్రే హైలేట్‌ అవ్వనుందా!

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా సినిమా ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిద్దడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికితోడు ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అభిమానుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ చిత్ర యూనిట్ బిజీగా బిజీగా గడుపుతున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా  నెట్టింట ఓ వార్త తెగ షికారు చేసేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ చారులత అనే లేడీ కానిస్టేబుల్ పాత్రలో మెరవనుంది.

అయితే, ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో ఆమె యాక్ట్‌ చేస్తుందని..అందుకే ఆమె పాత్రను ఎక్కడా రివీల్ చేయడం లేదని.. ట్రైలర్‌లోనూ ఆమెకు ఒక్క డైలాగ్ మాత్రమే ఇచ్చారని ఓ టాక్‌ నడుస్తుంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాల్లో హీరోయిన్ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటెజీని ఆయన ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 నిజంగానే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ పాత్రే కీలకంగా ఉండనుందా అనేది సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories