గోవాలో ఎన్టీఆర్‌.. సైలిష్‌ గా ఉన్నాడు కదా!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్‌ సినిమా జోష్‌ తో ఎన్టీఆర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్‌ లో దేవర అనే మూవీ చేస్తున్నాడు.

ఇందులో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమాలో తారక్‌ పక్కా మాస్‌ లుక్‌ లో కనిపించబోతున్నాడు. అతి త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసుకోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్‌ కోసం గోవాకు వెళ్లాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

దేవర చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను, ఓ సాంగ్‌ ను గోవాలో చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ తో కలిసి విమానాశ్రయంలో కనిపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌ గా కనిపించాడు. ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం వెయిట్‌ లాస్‌ అయినట్లు తెలుస్తుంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్‌ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రతినాయకుడని గా బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories