“కోర్ట్” విషయంలో నాని ఈ స్టెప్ తీసుకోనున్నాడా? ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ నుంచి విడుదలకి వచ్చి సూపర్ హిట్ అయ్యిన తాజా సినిమాల్లో యంగ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన సోషల్ డ్రామా “కోర్ట్” మూవీ కూడా ఒకటి. నేచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ జగదీష్ తీర్చిదిద్దారు.
అయితే ఈ చిత్రంలో మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. మరి తన బ్యానర్ పై నాని సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు అది కూడా ఒక్క రీజనల్ గా మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ కూడా అందరికీ నచ్చేలా, మెచ్చేలా ఉండే కాన్సెప్ట్ లని తాను పట్టుకొస్తున్నాడని తెలుస్తుంది. ఇలానే కోర్ట్ లో కూడా పాక్సో యాక్ట్ నేపథ్యంలో కచ్చితంగా పాన్ ఇండియా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ నే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు చిన్న సినిమాలు సింగిల్ భాషలోనే వచ్చినప్పటికీ ఓటిటిలో మాత్రం పాన్ ఇండియా భాషల్లో వస్తున్నాయి. సో నాని కూడా ఈ స్టెప్ ని తీసుకొని ఓటిటిలో ఇతర డబ్బింగ్ భాషల్లో కూడా వదులుతాడా లేదా అనేది ప్రస్తుతం చర్చానీయాంశం అయ్యింది. రీమేక్ కోసం ఇతర భాషల నుంచి ఏమన్నా పిలుపు వస్తుందా అనేది ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత అందులో రానుంది.