కేటీఆర్ పలాయనవాదం తేలిపోతున్నది ఇలా..?

ఇవాళ రాజకీయాలు అంతా ఒకటే తరహాలో నడుస్తూ ఉంటాయి. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తే అవతలి వాళ్లే తుడుచుకుని కడుక్కోవాలనేది నవీనయుగపు రాజనీతి. అందరూ ఆ విద్యలో ఆరితేరిన వాళ్లే. కల్వకుంట్ల కుటుంబం అయితే.. అందులో ఘనాపాటీలు. పంచ్ మాటలను పేర్చుకుని డైలాగులు వల్లెవేస్తూ ఉండే కల్వకుంట్ల తారక రామారావు.. రేవంత్ రెడ్డి, ఏపీలోని బిజెపి ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టేశాడని ఆరోపణలు చేశారు. అది నానా రచ్చరచ్చ అయింది. దీనికి కౌంటర్ గా సీఎం రమేష్ నిప్పులు చెరగుతూ.. కేటీఆర్ బాగోతం మొత్తం బయటపెట్టారు. గతిలేని పరిస్థితుల్లో సీఎం రమేష్ బయటపెట్టిన అన్ని వివరాలకు కౌంటర్ ఇవ్వాల్సి ఉన్న కేటీఆర్- మాటల్లో మాత్రం చర్చకు నేను సిద్ధం అని డాంబికంగా పలుకుతున్నారు గానీ.. ఆయన మాటల్లోనే పలాయనవాదం తేలిపోతున్నది. ఒకవైపు బండి సంజయ్ కూడా చర్చకు నువ్వే తేదీలు వేదిక డిసైడ్ చేయమని సవాలు విసురుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఏం చేస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

సీఎం రమేష్ తన కౌంటర్లో చాలా స్పష్టంగా.. తన సంస్థ భారాస పాలనలో కూడా రెండు వేల కోట్లరూపాయలకు పైగా కాంట్రాక్టులు చేసిందని ఓపెన్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఆ ఆరోపణలకు సమాధానం చెప్పడం లేదు. కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీ తిహార్ జైలులో పెట్టినప్పుడు.. కేటీఆర్ తన ఇంటికి వచ్చి.. తమ మీద కేసులు లేకుండా చేస్తే.. భారాసను బిజెపిలో విలీనం చేస్తాం అని వేడుకున్న విషయాన్ని ఇప్పుడు సీఎం రమేష్ బయటపెట్టారు.

ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ‘చర్చకు సిద్ధం’ అని ప్రకటిస్తే దేని గురించి మాట్లాడాలి? బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయడానికి తాను వెళ్లానా లేదా, కవితపై కేసులమాఫీకోసం వెళ్లానా లేదా అనే విషయంపై చర్చకు సిద్ధం కావాలి. ఆయన ఆ మాట ఎత్తడం లేదు. సీఎం రమేష్ తనకు కాంట్రాక్టు వచ్చిన విషయం అబద్ధం అని అనడం లేదు. ఒప్పుకుంటున్నాడు. కేటీఆర్ ఆ విషయం మీద చర్చకు వస్తా.. హెచ్‌సీయూ భూములపై జరిగిన కుంభకోణంపై చర్చకు వస్తా అంటున్నారు. కేటీఆర్ మాటలు ఏమాత్రం పసలేనివిగా తేలిపోతున్నాయి. హెచ్‌సీయూ భూముల్లో కుంభకోణం జరిగి ఉంటే అది వేరే సంగతి. కాంట్రాక్టు సంగతి సీఎం రమేష్ ఒప్పుకుంటుండగా ఇక చర్చించేదేం లేదు.

ఇంతకూ భారాస విలీనం గురించి చర్చించే ధైర్యం కేటీఆర్ కు ఉందా లేదా? తేల్చాలి! ‘ప్లేస్ ఎక్కడో చెప్పు.. సీఎం రమేష్ ను నేను తీసుకువస్తా.. పక్కా తీసుకువస్తా.. ఆ బాధ్యత నేను తీసుకుంటా’ అని బండి సంజయ్ అంటున్నారు. సీఎం రమేష్ బయటపెట్టిన వాస్తవాల గురించి చర్చకు కల్వకుంట్ల తారక రామారావు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వచ్చి వెళ్లిన సీసీటీవీ ఫుటేజీలతో సహా తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని అన్నింటినీ బయటపెడతాం అని అంటున్నారు. మరి ఆ సవాళ్ల జోలికి వెళ్లకుండా.. కేటీఆర్ డొంకతిరుగుడుగా మాట్లాడడం అనేది.. ఆయన లొసుగులనే బయటపెడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories