జగన్ విదేశీయాత్ర మానసిక వైద్యం కోసమేనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంత సస్పెన్స్ తరవాత యూరోపు యాత్రకు బయల్దేరి వెళ్లారు. ఆయన పిల్లలు లండన్ లోనే చదువుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పిల్లలు అక్కడినుంచి ఓటువేయడానికి వచ్చారు కూడా. జగన్ తిరిగి సకుటుంబంగానే విహారయాత్రకు వెళుతున్నట్టుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. అందుకోసమే ఆయన, తాను బెయిలు మీద బయట ఉన్నందున, సీబీఐ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. సీబీఐ ఆయన విదేశాలకు వెళ్లడానికి అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ.. సీబీఐ కోర్టు అనుమతించింది. మొత్తానికి ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు కూడా!

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు జగన్మోహన్ రెడ్డి యూరోప్ యాత్ర ప్లాన్ చేసుకోవడం వెనుక ఉద్దేశం కేవలం విహార యాత్ర మాత్రమేనా? అంతకుమించిన మర్మం ఇంకేమైనా ఉన్నదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి కి రహస్యంగా చేయిందలచని కొన్ని చికిత్సల కోసమే ఈ విదేశీ పర్యటన పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన కొన్ని చికిత్సలు చేయించుకున్నారంటూ వదంతులు వినిపించాయి. ఆయన ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకు చికిత్స చేయించుకోవడమే ఆయన విదేశాలకు వెళ్లారని.. షెడ్యూలు వివరాలు బయటకు చెప్పకుండా కొన్ని రోజులు విదేశాల్లో గడపడం వెనుకమర్మం అదేనని వదంతులు వచ్చాయి.

ఆ తర్వాత అనేక సందర్భాలలో విపక్షాలు జగన్ గురించి అలాంటి ఆరోపణలు చేశాయి. జగన్ కు కొన్ని రకాల మానసిక రుగ్మతలు ఉన్నట్టుగా ఆయన సొంత పార్టీ వారే చెబుతున్నారంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ కుటుంబసమేతంగా జూన్ 1 వ తేదీన తిరిగివచ్చేలాగా పదిరోజుకు పైగా విదేశీయాత్ర ప్లాన్ చేసుకోవడంతో.. మళ్లీ ఆయన మానసిక చికిత్సకు సంబంధించి పుకార్లు వినిపిస్తున్నాయి. జగన్ ఈ ఎన్నికల్లో ఓటమిచెందితే గనుక.. నెలల వ్యవధిలోనే మరోసారి విదేశాలకు చికిత్స నిమిత్తం వెళ్లవచ్చునని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories