దువ్వాడ బాగోతంలో జగనన్న పరువు గోవిందా?

యథారాజా తథా ప్రజా అంటారు పెద్దలు. పార్టీ నాయకుడు ఎలా ఉంటే, ఆ ప్రభావం పార్టీలోని నాయకులు, కార్యకర్తలందరి మీద పడుతుందని ఈ సామెత చెబుతుందేమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడంతా రివర్సులో జరుగుతోంది. నాయకులు, కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తోంటే.. దాని యొక్క ప్రభావం పార్టీమీద పడుతోంది. నాయకుల వ్యవహార సరళి వారు ఇరుక్కుంటున్న వివాదాల పుణ్యమాని.. వైఎస్సార్ కాంగ్రెస్ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు కూడా బజార్న పడుతున్నాయి. ఇప్పుడు టెక్కలిలో వైసీపీకి పెద్దదిక్కు అయిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోని వివాహేతర సంబంధాల వ్యవహారం పార్టీ పరువు తీస్తోంది.

జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన అనుయాయుల్లో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. ఆయనకు భార్య దువ్వాడ వాణితో సత్సంబంధాలు లేకపోయినప్పటికీ.. ఆ ఇద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చాలా చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. వారి ప్రెవేటు వ్యవహారాలు ఎవ్వరికీ తెలియనివి కాదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. రాజకీయంగా వారికి పెద్దపీట వేశారు. తీరా ఇప్పుడు ఆ వివాహేతర సంబంధాలు బజార్న పడ్డాయి. శ్రీనివాస్ భార్య వాణి.. ఆయన వివాహేతర బంధం కలిగిఉన్న వాణితో ఉండగా ఆ ఇంటి వద్దకు కూతురు సహా వెళ్లి రభస చేయడం, దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురు మీద దాడికి ప్రయత్నించడం ఇవంతా అందరూ చూశారు. తాజాగా ఆయనతో బంధంలో ఉన్న మాధురి.. ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా చెబుతుండడం కొత్త వివాదం.
ఆమె ప్రయాణిస్తున్న కారు.. పలాస మండలంలోని టోల్ ప్లాజా దాటిన తర్వాత ఆగిఉన్న కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తే.. తను లారీని ఢీకొని ఆత్మహత్య చేసుకోవడానికే రోడ్డు మీదకు వచ్చానని.. దువ్వాడ వాణిని అరెస్టు చేస్తే మాత్రమే చికిత్స చేయించుకుంటానని నానా గోల చేశారు. ఆమె తనను కించపరిచారని ఆరోపించారు. లారీని ఢీకొని ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన ఆమె.. ఆగిఉన్న కారును ఎందుకు ఢీకొన్నారో, తద్వారా ఆత్మహత్య సాధ్యమని ఎలా అనుకున్నారో తెలియదు. కానీ, ఈ వ్యవహారాలతో జగన్ ఎలాంటి విలువల్లేని నాయకులను నెత్తిన పెట్టుకుని ప్రాధాన్యం ఇస్తున్నారో.. రాష్ట్రమంతా గమనించే పరిస్థితి వచ్చింది. ఓడిపోయి అసలే కుదేలైఉన్న పార్టీని ఈ దువ్వాడ గొడవలు మరింత దారుణంగా దెబ్బతీస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories