పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఓజి” సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. ఈ సినిమా మొదటి నుంచి అంచనాలకు మించి హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యి రిలీజ్‌కి సిద్ధమవుతుందని సమాచారం. రెండో పాట కూడా త్వరలో రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల ఓ కొత్త రూమర్ ఫ్యాన్స్‌లో గందరగోళం కలిగించింది. ఇంకా షూటింగ్ బాకీ ఉందని కొన్ని టాక్‌లు బయటకు రావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ సినిమా టీమ్ మాత్రం అన్ని షూటింగ్ పనులు ఎప్పటికే పూర్తి చేశామని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకోవచ్చు.
ఇక వినాయక చవితి నుంచి మేకర్స్ ప్రమోషన్స్‌కి స్పీడ్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది.