ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు, సాక్షి మీడియా సంస్థలు తలమునకలై బతుకుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబునాయుడు ను బద్నాం చేస్తేనే వారికి జీవితం. అందుకోసం ఎంతటి కుటిల ప్రచారాలకైనా వారు తెగిస్తూనే ఉంటారు. కానీ కనీసం తెలంగాణలో అయినా నిష్పాక్షికంగా ఉండవచ్చు కదా అనేది ప్రజల సందేహం. అక్కడ కూడా రేవంత్ సర్కారు మీద విషం కక్కుతున్న తీరును గమనిస్తే.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు అయిన కేసీఆర్ కు మేలు చేయడం కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్తు అందిస్తుండగా.. ఆ పథకం మీద కూడా సాక్షి దళాలు విషం చిమ్ముతున్నాయి.
తెలంగాణలో పేదలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని రేవంత్ ఎన్నికల హామీల్లోనే ప్రకటించారు. ఆ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత.. 200 యూనిట్లు దాటని ఇళ్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. ఇందులో మార్పు చేర్పుల గురించి ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాలు రాలేదు. అయితే సాక్షి పత్రిక మాత్రం.. అప్పుడే ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నట్టుగా. లబ్ధిదారుల్లో కోత పెట్టడానికి కుట్రలు జరుగుతున్నట్టుగా దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నది. 200 యూనిట్లు దాట్టి ఒక్క యూనిట్ కరెంటు వాడకం పెరిగినా సరే.. ఆ ఇంటికి ఉచిత విద్యుత్తు రద్దు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా సాక్షి ప్రచారం చేస్తోంది.
ప్రస్తుతానికి అలాంటి నిబంధన ఏదీ లేదు. అయితేఇది వారి ఊహల్లో పుట్టిన విషయం అన్నమాట.
నిజానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగినప్పుడు ఇలాంటి దుర్మార్గమైన విధానాలనే అవలంబించారు. వేసవిలో ఇళ్లలో కరెంటు వినియోగం అధికంగా ఉండడం సహజం. అలాంటి సందరల్భాల్లో ఒక్క నెలలో ఒక్క యూనిట్ కరెంటు వినియోగం ఎక్కువ జరిగినా వారికి వృద్ధాప్య, వితంతు పెన్షన్లను రద్దు చేసేసిన ఘనత జగన్ సర్కారుది. ఇప్పుడు తమ లాగానే అందరూ పేదల కడుపులు కొడుతున్నారని వారు ఆలోచిస్తూ, రేవంత్ సర్కారును బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగా ఇలాంటి నిబంధనలు విధించేప్పుడు.. మూడునెలల సగటు వినియోగం తీసుకుని అర్హతను పరిగణిస్తారు. సగలు తక్కువగా ఉంటే.. మళ్లీ ఉచితం వర్తించేలా చేస్తారు. కానీ.. జగన్ అలా కాకుండా.. అడ్డగోలుగా పెన్షను లబ్ధిదారుల్ని తొలగించారు. ఆయన సాక్షి దళాలు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ సర్కారుపై విషం కక్కుతున్నాయి. ఇదంతా కూడా.. తనకు ఆత్మీయుడైన కేసీఆర్ కు మేలు చేయడం కోసమే చేయిస్తున్నట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.