తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించాడు. క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోగలిగే స్కిల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. పైగా మొదటి సినిమాతోనే వేరియేషన్స్ చూపిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు. అయితే, అనుపమ పరమేశ్వరన్ తో పాటు ధృవ్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పైగా అతనితో అనుపమ పెళ్లికి రెడీ అవుతోందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమా..? లేదా ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే అనుపమ-ధృవ్ ల నడుమ మంచి సాన్నిహిత్యం వుందని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూట్ లో ఇద్దరు దగ్గర అయ్యారట. ఐతే, ఆ దగ్గరితనం ఎంతవరకు అనేది చూడాలి.