ఈ సారి అజిత్‌ పోటీ రెబల్‌స్టార్‌ తోనా?!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినా కూడా ఈ మూవీపై సాలిడ్ బజ్ ఏర్పడటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను దర్శకుడు మారుతి పూర్తి హర్రర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తుండగా ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవతున్నారు. రాజా సాబ్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాకు ఇప్పుడు మరో బడా మూవీ పోటీగా రాబోతుంది.

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తొలుత పొంగల్ కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

దీంతో బాక్సాఫీస్ దగ్గర రెండు పెద్ద సినిమాలు ఢీకొనడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే, రాజా సాబ్ మూవీ ఏప్రిల్ 10న రాకపోవచ్చనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఏప్రిల్ 10న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ నెలకొంటుంది అనే ఆసక్తి  అందరిలో నెలకొంది.ఈ విషయం గురించి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories