రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. .ఈ సినిమాకు థియేటర్ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. అయితే ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ దేవరకొండ 14 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ1854 నుంచి 1894 మధ్య జరిగే చారిత్రాత్మక కథతో రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ యోధుడిగా కనిపించనున్నాడు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా రూపుదిద్దుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కి మేకర్స్ ‘రణభాలి’అనే ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కథ ఎంతో భిన్నంగా ఉంటుందని సమాచారం. అయితే విజయ్ మొదటిసారి డిఫరెంట్ జోనర్ మూవీ ఎంచుకున్నాడు.ఈ మూవీతో అయిన విజయ్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడా లేదో వేచి చూడాల్సిందే.