వార్ 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు!

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మూవీ ఏదైనా ఉంది అంటే అది ‘వార్ 2’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే, ఈ చిత్రం భారీ బజ్‌ను సృష్టించింది. ఐతే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, హృతిక్ – ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన మొదటి మోషన్ పోస్టర్ 2025 మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 90% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories