చరణ్‌ సినిమాల పై ఆసక్తికర కామెంట్లు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది చరణ్ కెరీర్‌లో మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా పూర్తయ్యాక చరణ్ ఇంకొన్ని పెద్ద సినిమాల కోసం సెట్ అవుతున్నాడని టాక్ ఉంది.

ఇప్పటికే చరణ్ తన 17వ సినిమాగా దర్శకుడు సుకుమార్‌తో సినిమా చేయబోతున్నాడన్నది అధికారికంగా తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆ ప్రాజెక్ట్ చరణ్ తర్వాతి సినిమా కాబోతుందనేది ఖాయం అంటున్నారు.

ఇక తాజాగా చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడంటూ గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై చరణ్ సర్కిల్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికి అలాంటి ప్రాజెక్ట్ ఏదీ ఫిక్స్ కాలేదట. అంటే, సుకుమార్ సినిమా పూర్తయ్యాకే త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అర్థమవుతోంది.

ఈ లెక్కన చూస్తే, చరణ్ నెక్స్ట్ మూవీస్ లైనప్ విషయంలో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న త్రివిక్రమ్ గాసిప్స్‌లో నిజం లేదని చెప్పవచ్చు. ఇకపోతే, ఫ్యాన్స్ మాత్రం చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అనే ఆసక్తిలో ఉన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories