కుటుంబసభ్యులపై దూషణ.. జగన్ దళాల మొసలి కన్నీరు!

జగన్మోహన్ రెడ్డి తరఫున విషం కక్కే కుటిల దళాలకు లడ్డూ లాంటి అవకాశం దొరికింది. ఒక చిన్న పాయింటు దొరకగానే..  దానికి చిలవలు పలవలు జోడిస్తూ మంట రాజేయడానికి జగన్ దళాలు మరియు సాక్షి దళాలు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నాయి. ఈ సాకుతో తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టగలిగితే.. జగన్ కళ్లలో ఆనందం చూడగలమని వారు తపన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. తమాషా ఏంటంటే.. గురివింద గింజ తన వీపు మీద నలుపు గురించి తెలియకుండా ఎదుటి గింజ వీపుపై నలుపు చూసి హేళనగా నవ్వుతుందనే సామెత చందంగా.. జగన్మోహన్ రెడ్డి దళాలు జూ.ఎన్టీఆర్ గురించి ఆవేదన వ్యక్తం చేయడం చవకబారుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ గురించి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒక ఫోన్ కాల్ లో అనుచిత వ్యాఖ్యాలు చేశారనే ఆడియో ఒకటి వైరల్ అయింది. నిజానికి ఆ ఆడియో తనది కాదని.. అయినా ఎవరైనా నొచ్చుకుంటే తనను క్షమించాలని ఎమ్మెల్యే ప్రసాద్ మీడియాముఖంగా చెప్పారు కూడా. ఆ ఆడియోలో.. జూ.ఎన్టీఆర్ తల్లి గురించి కూడా చులకనగా నిందలు వేసినట్టుగా బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై నిజంగానే ప్రసాద్ ఆడియోనా? కాదా? అనేది తేలకపోయినప్పటికీ.. చంద్రబాబు ఆ ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది జరగ్గానే.. సాక్షి దళాలు పండగ చేసుకుంటున్నాయి. ఈ పాయింటును పట్టుకుని.. తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. జూ.ఎన్టీఆర్ పట్ల సానుభూతితో వారు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి తమ భజన చానెల్లో ప్రచారం చేస్తున్నారు.

తమ సొంత కుటుంబ సభ్యులను దూషించినా కూడా చంద్రబాబునాయుడు వారిపై చర్యలు తీసుకోలేదంటూ సాక్షి దళాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. కుటుంబసభ్యులు అంటే వారి అర్థం జూ.ఎన్టీఆర్ తల్లి గురించి. అన్న ఎన్ టి రామారావు కుటుంబంగా వీరందరూ ఒక్కటే కావొచ్చు.. కానీ చంద్రబాబు మీద ఇలాంటి నింద వేసే అర్హత వీరికున్నదా అనేది సందేహం.

ఎందుకంటే.. తన సొంత చెల్లెలు, కన్న తల్లి మీద.. తన పార్టీలోని వారు.. తన భార్యకు పీఏగా చెప్పుకుంటూ దందాలు చేస్తున్న వారు సోషల్ మీడియాలో పచ్చి బూతులు పెడితే.. తన కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెడితే.. ఏమాత్రం పట్టించుకోకుండా ఉపేక్షించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఆయన వందిమాగధ గణాలు ఇప్పుడు.. చంద్రబాబు మీద నిందలు వేయడం ఆశ్చర్యకరంగా ఉంది. కన్నతల్లిని రోడ్డున పడేయడానికి ఆస్తులు లాక్కోవాలని చూసే వ్యక్తి జగన్.. ఆయన తైనాతీలు మాత్రం  ఇతరుల కుటుంబాల్లో వ్యవహారాల గురించి ప్రత్యేకంగా టీవీషోలు నిర్వహిస్తూ ఆనందం పొందుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories