ఇండియన్‌ 2 విడుదల తేదీ ఫిక్స్‌!

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇండియన్‌ 2 ఈ సినిమాను కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో సిద్దార్థ్‌, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్‌ వంటి తదితరురులు కీలక పాత్రల్లో  నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.అలాగే ఇండియన్ 2 ఫస్ట్‌ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచేసాయి.

సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి అదరగొట్టారు ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అయితే రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చినట్లు సమాచారం.. ఇండియన్ 2 సినిమాను మేకర్స్ జూన్ 13 న విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం..త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories