తేజాకు జోడిగా హాయ్‌ నాన్న భామ!

తేజా సజ్జా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు తేజా తీసిన సినిమాలు హిట్ ని అందుకున్నాయి. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన హనుమాన్‌ మాత్రం సూపర్‌ హిట్‌ అందుకుని భారీ కలెక్షన్లను వసూలు చేసి అగ్ర హీరోల సరసన తేజాని నిలబెట్టింది.

ఈ సినిమాతో పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్న తేజా తన నెక్స్ట్‌ సినిమాకి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఓకే కానీ తేజా పక్కన హీరోయిన్‌ గా చేస్తున్న నటి ఎవరు అనే దాని మీద కూడా చాలా అనుమానాలు నెలకొన్నాయి.

తాజాగా హీరోయిన్ ఎవరనే దాని మీద ఓ క్లారిటీ వచ్చేసింది.  హీరో తేజ తన తరువాతి సినిమాను కార్తీక్ ఘట్టమనేనితో చేయనున్ననట్లు టాక్‌ . ఈ డైరెక్టర్‌ మాస్ మహారాజ రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.తాజాగా తేజా- కార్తీక్‌ కాంబోలో మిరాయ్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రితికా నాయక్‌ అనే ఢిల్లీ భామ నటిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ ఢిల్లీకి చెందిన మోడల్. తెలుగులో ఇప్పటివరకూ రెండు సినిమాల్లో నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, హాయ్ నాన్న సినిమాల్లో మెరిసింది.  రితికా నాయక్‌ తేజకి జోడిగా సెట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా తరువాత తేజా జై హనుమాన్ సినిమా లో నటించనున్నారు..

Related Posts

Comments

spot_img

Recent Stories