జక్కన్న-మహేశ్‌ మూవీ పై కీలక అప్డేట్‌!

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు, జక్కన్న త్వరలోనే ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి తగ్గట్టు మహేశ్‌ తన లుక్‌ ని మార్చే పనిలో పడ్డాడు. అందుకోసం బాడీ, గడ్డం పెంచబోతున్నాడు ఈ సూపర్‌ స్టార్‌ . ఈ చిత్రాన్ని మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు.

కానీ ఫ్యాన్స్ కు పెద్ద నిరాశే ఎదురైంది. తాజాగా రాజమౌళి టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం అక్టోబరు 10న రాజమౌళి పుట్టినరోజు కి ssmb 29 కి సంబంధించిన న్యూస్ ఏదో ఒక అప్ డేట్ ఉంటుంది. ఈ నెల చివరాఖరి నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని సమాచారం.

 డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు మొదలు పెడుతున్నారు.  ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టబోతున్నారు. ఫారిన్ లోని అడవులలో భారీ చేజింగ్ సిక్వెన్స్ ను ముందు చిత్రీకరించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు GOLD అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించబోయే హీరోయిన్, అలాగే విలన్ ఎవరనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories