కన్నప్ప నుంచి ప్రభాస్‌ పాత్ర గురించి కీలక అప్డేట్‌!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్ప సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా సినిమా నుంచి ప్రభాస్‌ లుక్‌ కోసం అభిమానులంతా వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కల్కి మూవీ పూర్తి అయిన తర్వాత మారుతీ డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ ని మొదలు పెడతారు.

అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌   ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. కల్కి 2898 ఏడీ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే కన్నప్ప కోసం ప్రభాస్ డేట్స్ ఇవ్వనున్నారని టాక్‌.   అయితే కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు అని తెలియగానే ఈ చిత్రంలో ప్రభాస్ శివుడి పాత్రలో చేస్తున్నాడని అనుకున్నారు. కానీ, కన్నప్పలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించడం లేదని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

 అయితే ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటి అనే దాని గురించి ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ప్రభాస్ మాత్రం శివుడి పాత్ర చేస్తున్నాడు అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఓ క్రేజీ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ చేసేది శివుని పాత్ర కాదని…అందుకు ప్రభాస్‌ ఒప్పుకోలేదని.. కానీ శివుని ముందు నందీ పాత్ర చేసేందుకు ప్రభాస్‌ రెడీ గా ఉన్నాడని టాక్‌.
దీంతో ప్రభాస్ చేయబోయేది నందీశ్వరుడి పాత్ర అని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories