బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. సింపుల్‌గా ఉన్నా చాలా ఎమోషనల్ గా ఉంటాడు. ఐతే, అమీర్ ఖాన్ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా అమీర్ తన మాజీ భార్య రీనా దత్తా గురించి స్పందించారు. ‘రీనాతో నేను విడిపోయిన సమయంలో నేనెంతో బాధపడ్డాను. సుమారు మూడేళ్లపాటు అలానే గడిపాను. ఆ విషయం ఎవరికీ తెలియదు. అప్పట్లో నేను కుమిలిపోయేవాడ్ని. నా వర్క్‌పై కూడా నేను దృష్టి పెట్టలేకపోయేవాడ్ని. ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడే వాడిని. ఓ దశలో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం తాగడం మొదలు పెట్టాను. నిజానికి నాకు ఆల్కహాల్ గురించి ఏమీ తెలియదు.
అలాంటి నేను ఉన్నట్టుండి రోజుకో బాటిల్ తాగడానికి అలవాటు పడ్డా. ముందుకి బానిసయ్యా. దేవదాస్‌లా అయ్యా. ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా టైమే పట్టింది’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘మనం చేసిన తప్పులేంటని తెలిస్తే.. తర్వాత తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. నా జీవితంలో నేను అదే చేశాను. ఇక అలాంటి కష్ట కాలంలో నా కుటుంబం నాకు తోడుగా నిలిచింది’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.