నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గతంలో పాల్పడిన అవినీతిని, నియోజకవర్గంలో సాగించిన దందాలను ఉద్దేశించి.. ఆమెకు రెండు వేలు ఇస్తే ఏ పని అయినా చేసేది అని విమర్శించినందుకు.. ఆ మాటలను బూతు కింద అభివర్ణించి.. ఆ మాటల్లో లేని బూతును రోజాకు ఆపాదించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రోజా కు లేని బూతుపనులను ఆపాదించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయ మైలేజీ పొందాలని అనుకున్నారు. తన పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన నీచమైన భాష విషయంలో వచ్చిన అపకీర్తిని.. ఇలా రోజాను బద్నాం చేయడం ద్వారా కడిగేసుకోవచ్చునని జగన్ తలపోశారు. మధ్యలో రోజా బలిపశువు అయ్యారు. ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు రోజా మాట్లాడే భాష ఎలాంటిది? ఆమె నోటి దురుసుతనం ఎలా ఉంటుంది? ఆమె ఎలాంటి పచ్చిబూతులు బహిరంగ వేదికల మీద కూడా మాట్లాడుతూ ఉంటారు… అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మాటలు గమనించాల్సిందే.
ఆమె నగరిలో మాట్లాడుతూ.. ‘‘గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు (ఎమ్మెల్యేలను ఉద్దేశించి) ఎక్కువైపోయారు రాష్ట్రంలో. తెదేపా జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడు హైదరాబాదుకు పారిపోతున్నారు. రేపు జగనన్న ప్రభుత్వం వస్తే హైదరాబాదు కాదు.. అమెరికాకు పారిపోతారు.. ఆరోజు మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ ఉండరు’’ అంటూ నోరు పారేసుకున్నారు. ‘గాలిలో పుట్టిన గాలి నా కొడుకులు’ అని అనడం ద్వారా అందరు ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, ఆమె తన నియోజకవర్గంలోని ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ను కూడా ఉద్దేశించి ఉండవచ్చు. ఇంత నీచంగా మాట్లాడే మహిళను గతంలో తాము ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నగరి ప్రజలు బాధపడే పరిస్థితిని ఆమె కల్పించారు.
ఆమె అవినీతి గురించి మాట్లాడితేనే దానిని బూతుకింద అభివర్ణించిన పెద్దలు.. ఆమె నోటమ్మట ధారాపాతంగా వస్తున్న ఇలాంటి పచ్చిబూతుల గురించి ఏం మాట్లాడతారో చూడాలి.
నిజానికి రోజా బూతులు మాట్లాడడంలో చాలా ప్రావీణ్యం ఉన్న నాయకురాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. అసెంబ్లీ హైదరాబాదులోనే నడుస్తున్న రోజుల్లో.. శాసనసభలో రోజా మాట్లాడిన బూతులు దేశచరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ చూసి ఉండరని.. ఆనాడు సభలో ఉన్నవాళ్లు అంటూ ఉంటారు. సభలో పెద్ద వివాదం రేగినప్పుడు.. రోజా తన సీటులోంచి లేచి.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడారు. అందుకు బుచ్చయ్య.. నువ్వు మహిళవు కదా అని అన్నందుకు.. అందుకోసం మనుషుల్ని నియమిస్తా అంటూ రోజా మరింతగా పచ్చిబూతులు లంకించుకున్నారు. ఆ వ్యాఖ్యలు రికార్డులనుంచి తొలగించబడ్డాయిగానీ.. సభలో ఉన్నవారందరికీ ఆమె బూతుప్రియత్వం గురించి బాగానే తెలుసు. అప్పట్లో స్పీకరు కోడెల శివప్రసాదరావు.. పదవీకాలం ముగిసేవరెకు రోజాను సభనుంచి సస్పెండ్ చేశారు కూడా. అయినా కూడా రోజాలో మార్పు రాలేదు. తనను పల్లెత్తు మాట అంటే బూతులు తిట్టారని గోలచేస్తూ.. తాను మాత్రం పచ్చిబూతులే తిడుతూ ఆమె తన బుద్ధిని చాటుకుంటున్నారు.