ప్రేమించే పెళ్లి చేసుకుంటా: విజయ్‌ దేవరకొండ!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి, ప్రేమ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అసలు అయితే విజయ్‌ రష్మిక ప్రేమలో ఉన్నారని.. సీక్రెట్‌ గా వారిద్దరూ రిలేషన్ మెయిటెన్‌ చేస్తున్నారని ఇండస్ట్రీలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా విజయ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతూ… తప్పకుండా నేను లవ్‌ మ్యారేజ్‌ నే చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ పెళ్లి మాత్రం ఇప్పుడే ఉండదని ఓ క్లారిటీ ఇచ్చాడు.

నేను ప్రేమ వివాహం చేసుకున్నా కూడా ఆ పిల్లని…తన అమ్మానాన్నలే ఎక్కువగా ప్రేమించాలని అప్పుడే చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. విజయ్‌ తన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చెన్నైలో మీడియాతో ముచ్చటిస్తూ తన ప్రేమ పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు.

అయితే విజయ్‌ మాటలను బట్టి విజయ్‌ కచ్చితంగా ప్రేమలో ఉన్నాడని అందుకే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడినట్లు అభిమానులు అనుకుంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని విజయ్ చెప్పుకొచ్చాడు. తన గత సినిమాల రికార్డులను ఈ సినిమా బ్రేక్‌ చేస్తుందని చెప్పుకొచ్చాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories