కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ గురించి తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి చిందులు వేసింది. ఈ అల్బమ్ ఇనిమేల్ అనే పేరు కూడా పెట్టారు. దీనికి స్వయంగా కమల్ నే లిరిక్స్ ఇచ్చారు. ఈ సాంగ్ కి ద్వారకేశ్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి ఈ పాటకు సంబంధించిన కొన్ని విషయాలను వివరించారు. లోకేశ్ గురించి అందరికీ ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మాత్రమే తెలుసు. ఎందుకంటే అతను సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి. తాజాగా ఈ పాటతో తనలోని నటుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ పాటలో ప్రేమ అనేది ఇద్దరిలో ఉండే బంధం. ఆ బంధాన్ని నాలుగు నిమిషాల్లో చూపించాలనుకున్నాం. ప్రేమ అనేది ఓ భ్రమని నా నమ్మకం. భవిష్యత్తులో ఓ బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలిస్తే ఎవరైనా ఆ బంధంలో ఉంటారా లేదా అనే ప్రశ్నను మేము ఈ పాట రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.
ఈ సాంగ్ ని మూడు రోజుల పాటు వివిధ లోకేషన్లలో షూట్ చేశాం. నాన్నతో కలిసి మరోసారి పని చేసేందుకు అవకాశం దొరికింది. ఆయన గొప్ప రచయిత కూడా.. ఎంత బిజీగా ఉన్న పిల్లల గురించి ప్రతి విషయం తెలుసుకుంటారు…అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది.