జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో.. అయిదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్నో అరాచకాలు జరిగాయి. చీకట్లో జరిగిన అరాచకాలు మరో ఎత్తు. ప్రత్యేకించి హిందూ ఆలయాలు, దేవుళ్లు, ఆస్తుల మీద జరిగిన దాడులు, దొంగతనాలు గురించి ప్రస్తావించుకోవాలి. అలాగే జాతీయ నాయకులు, ఎన్టీఆర్ విగ్రహాలను అవమానించడం, ధ్వంసం చేయడం వంటి సంఘటనలు కూడా అనేకం జరిగాయి. అయితే వీటన్నింటినీ.. జగన్ దళాల్లో ఉన్న పోలీసులు చాలా లైట్ గా తీసుకున్నారు. ఆలయాల మీద, నాయకుల విగ్రహాల మీద జరిగిన దాడులన్నీ పిచ్చివాళ్లు, మతిస్తిమితం లేనివాళ్లు చేసిన దాడులుగా వర్గీకరించి, దిక్కూమొక్కూలేని వారిని అందుకు బాధ్యులుగా చూపించి.. కేసులను క్లోజ్ చేశారు. కానీ.. కూటమి ప్రభుత్వంలో అలాంటి చీకటిలో చేసే నేరాలకు పాల్పడితే.. అప్పటిలాగానే.. ఎంచక్కా తప్పించుకు తిరగవచ్చునని అనుకునే వారికి పోలీసులు చెక్ పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పరిధిలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్ఝహాలకు చీకట్లు ఇంకా ముసురుకుని ఉన్న సమయంలో మెడలో చెప్పులదండలువేసి శాంతి భద్రతలు భగ్నం చేయాలని కుట్ర పన్నిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడే నని పోలీసులు తేల్చి, అరెస్టు కూడా చేశారు.
అప్పటి ప్రభుత్వంలో ఉన్న పోలీసులే.. ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఉంటారు. కానీ నాయకుల సమర్థతను బట్టి.. నాయకుల విజ్ఞతను బట్టి, చిత్తశుద్ధిని బట్టి వారి పనితీరు కూడా ఉంటుంది. ఇదే తరహా చీకటి అకృత్యాలు గత ప్రభుత్వ కాలంలో జరిగి ఉంటే.. ఆ తప్పులు తమ పార్టీకి చెందిన వారు చేసినట్టుగా గుర్తించి ఉుంటే.. పోలీసులు చాలా చిత్రంగా వ్యవహరించి ఉండేవారు. పిచ్చివాళ్లు, బిచ్చగాళ్లు ఆకతాయిగా ఇలాంటి పనిచేశారని ప్రకటించి అక్కడితో చేతులు దులుపుకునే వారు.
కానీ, నేర విచారణలో సైతం టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఉండాలని అంటున్న చంద్రబాబునాయుడు పాలనలో అలాంటి పప్పులుడకవని నిరూపణ అవుతోంది. పుల్లలపాడు గ్రామానికి చెందిన మాల వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బురుపుల బాబ్జీ ఈ రెండు విగ్రహాలకు తెల్లవారుజామున చీకట్లో వెళ్లి చెప్పుల దండలు వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. అతడే నేరానికి పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేశారు.
ఎస్పీ వర్గీకరణ చేయడానికి చంద్రబాబునాయుడు నిర్ణయం ప్రకటించిన తర్వాత.. వైసీపీ లోని మాల వర్గానికి చెందిన నాయకుడు.. ఏకంగా అంబేద్కర్ మెడలోను, ఎన్టీఆర్ మెడలోను చెప్పుల దండలు వేయడం అతిపెద్ద దుశ్చర్య. సభ్య సమాజం ఖండించాల్సిన చర్య. తమ పార్టీ నేత ఇలాంటి తప్పుడు పనిచేసినందుకు వైసీపీ పెద్దలే సంజాయిషీ చెప్పాలని, ఎస్సీ వర్గీకరణ పై పార్టీ విధానం ఏమిటో కూడా చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.