అలా చేస్తే టాలీవుడ్‌ నుంచి గెంటేస్తాం!

ప్రతి ఏడాది జూన్ 26న జరిపే ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా మాదక ద్రవ్యాల వల్ల సమాజం ఎలా దెబ్బతింటుందో తెలియజేసేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగం నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు.

వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యూత్ ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ, అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యంగా పాల్గొన్నారు. ఈ ముగ్గురు తమ హాజరుతో ఈ అవగాహన కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సినీ పరిశ్రమలో ఎవరైనా మాదక ద్రవ్యాలను వాడుతున్నట్లు గుర్తిస్తే, వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయంలో గట్టి నిబంధనలు అమలు చేస్తోందని చెప్పారు. అలాంటి విధానాలు టాలీవుడ్‌లో కూడా అమలయ్యేలా పరిశ్రమ మొత్తం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇలాంటివి ముందుగానే గుర్తించి నియంత్రించడంలోనే సమాజానికి మేలు జరుగుతుందని, అందరికీ బాధ్యత ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సందేశం ఇచ్చారు. ప్రజల్లో ఈ విషయంలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమైంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories