కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం పెడుతుంటుంది.
రీసెంట్ గానే బ్రేకప్ అయిన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవడమే కాకుండా తాను ప్రెజెంట్ సింగిల్ గానే ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన శృతి హాసన్ ఓ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది
సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్ అడగ్గా.. అందుకు శృతి చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఓకే.. ఈ రకమైన జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే నేను ఊరుకోను. మీరు మమ్మల్ని అనుకరించలేరు.. కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి.. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోఉ అంటూ చెప్పింది.
అలాగే సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లిపో అంటూ తమిళంలో రాసుకొచ్చింది. దీంతో శృతి హాసన్ పెట్టిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.