తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్స్‌కు అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, రిలీజ్ సమయానికి భారీగా హైప్ ఏర్పడింది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, థియేటర్లవద్ద సందడి చూస్తేనే స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే, ఇప్పటికే భారీ అంచనాలతో కొనసాగుతోన్న మరో పవన్ కళ్యాణ్ చిత్రం ఓజిపై ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. ప్రారంభం నుంచే ఈ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొని ఉంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలయ్యే సమయానికి థియేటర్ల వద్ద ఎంతటి సందడి ఉంటుందో ఊహించటం కూడా కష్టం.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు ఫీవర్‌తో ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్, ఓజి కోసం ఇప్పటినుంచే కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. దాంతో పాటు సెప్టెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవన్ మేనియా మరింత పీక్‌కు చేరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.