వినేది పోలీసులైతే.. చెప్పేవాడు జోగి రమేష్!

ఒకదానితో ఒకటి పొంతన కుదరని సమాధానాలు చెప్పడంలో రాజకీయ నాయకులది అందవేసిన చేయి. తాము ఎక్కడా చిక్క కూడదనే ఉద్దేశంతోనే వారు చాలా తెలివిగా అలాంటి పొంతనలేని సమాధానాలు చెబుతుంటారు. రికార్డుల్లోకి వచ్చే సమయానికి చాలా జాగ్రత్తగా మాటలు వాడుతుంటారు. ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అదే పని చేస్తున్నారు. ఆయన మాటలు వింటే ఇంతటి పరిశుద్ధాత్మ స్వరూపుడు, సౌమ్యుడు రాజకీయాలలో మరొకరు ఉండరేమో అనిపిస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ పోలీస్ విచారణను ఎదుర్కొన్నారు. ఆయన చెప్పిన సమాధానాలు ఏమిటో తెలుసా.. చంద్రబాబు నాయుడుతో సంభాషించడానికి, ఆయనకు తమ ఆవేదన తెలియజేయడానికి మాత్రమే ఇంటికి వెళ్లారట. అప్పట్లో తెలుగుదేశం నాయకుడు అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తే.. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కి ఫిర్యాదు చేస్తే అయ్యన్నను మందలిస్తారు అనే ఉద్దేశంతో జోగి రమేష్- తాను చంద్రబాబు ఇంటికి వెళ్లినట్టుగా చెబుతున్నారు. తాను మంచి ఉద్దేశంతో వెళితే తన మీదనే  దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెదేపా కార్యకర్తలు తన వాహనాన్ని ధ్వంసం చేశారని వాపోయారు.

పోలీసు అధికారులు వెర్రివాళ్లు అని భావిస్తే ఇలాంటి కాశీ మజిలీ కథలు ఎన్నైనా చెప్పవచ్చు. కేవలం తమ నాయకుడిని తిట్టినందుకు నిరసన తెలియజేయడానికి ఫిర్యాదు చెప్పడానికి పదుల సంఖ్యలో తన అనుచర గూండాలను వెంటబెట్టుకుని పెద్ద సంఖ్యలో వాహనాలలో ఆయుధాలతో దూకుడుగా వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందో జోగి రమేష్ కే తెలియాలి. బహుశా తన అనుచర గుండాలందరూ ఎందుకు వచ్చారో తనకు తెలియదని తాను మాత్రం ఈ పని కోసమే వెళ్లానని జోగి రమేష్ చెబుతారేమో తెలియదు.

అయినా జగన్మోహన్ రెడ్డిని అయ్యన్నపాత్రుడు దూషిస్తే.. చంద్రబాబు నాయుడుతో పితురీ చెబితే ఏమవుతుంది. చంద్రబాబు నాయుడు ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి చవక బాలు నాయకులు అసభ్యంగా దూషిస్తే తెలుగుదేశం నాయకులు అందరూ వెళ్లి జగన్ వద్ద మొరపెట్టుకోవాలా? తన మాటల ద్వారా జోగి రమేష్ తెలియజేస్తున్న సందేశం అదేనా అని పలువురు నివ్వెరపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories