బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే…రానా ఫన్నీ రిప్లై!

భారతదేశం అంతా ఒకప్పుడు చర్చించిన ప్రశ్న ఏదంటే, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనేది. బాహుబలి మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి ఈ ప్రశ్న అందరికీ కుతూహలంగా మారింది. రాజమౌళి, ప్రభాస్ లు ఆ సస్పెన్స్ ని అంత అద్భుతంగా సెట్ చేయడంతో, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు.

ఇప్పుడు మేకర్స్ రీ-రిలీజ్ ముందు ఈ ప్రశ్నను మళ్లీ హైలైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాహుబలి టీమ్ “ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోతే?” అన్న ప్రశ్న వేసింది. దీనికి రానా సరదాగా స్పందిస్తూ, కట్టప్ప చేయకపోతే నేనే చేసేవాడిని అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు.

అదే సమయంలో ప్రభాస్ కూడా తన స్టైల్ లో ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. రానా సమాధానానికి కౌంటర్ ఇస్తూ, మీరిద్దరూ కాదు నేను స్వయంగా ఇందుకోసం చంపనిచ్చాను అంటూ బాహుబలి 2 వందల కోట్లు వసూలు చేసిన విజయాన్ని గుర్తు చేసేలా రిప్లై ఇచ్చాడు.

ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ మళ్లీ బాహుబలి మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ రీ-రిలీజ్ అక్టోబర్ 31న పాన్ ఇండియా లెవెల్ లో భారీగా జరగబోతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories