ఇప్పటివరకు భారతీయ సినిమాలోనే అత్యంత భారీగా చర్చకి వచ్చిన ప్రశ్న ఏదైనా ఉందంటే.. అదీ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్నదే. ఒక్క ఈ డౌటే బాహుబలి 2 సినిమాపై అంచనాలని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇదే కథకి మరో క్రేజీ ట్విస్ట్ జతవుతోంది.
ఈ సారి మేకర్స్ వేయిస్తున్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే.. ‘‘కట్టప్ప బాహుబలిని చంపలేదంటే ఏం జరిగేదీ?’’ అన్నదే. ఇప్పుడు ఇదే టాపిక్ చుట్టూ కొత్తగా ప్లాన్ చేస్తున్న మరో వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో బాహుబలి కథని రెండు పార్ట్స్‌లా మళ్ళీ గ్రాండ్‌గా అక్టోబర్ చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
ఈసారి స్టోరీ కాస్త ఫ్రెష్‌గా, కొత్త కోణంలో ఉంటుందనే ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ‘‘కట్టప్ప బాహుబలిని చంపకపోతే..’’ అనే కొత్త అంశంతో మేకర్స్ ఇప్పుడు ఊహించని మలుపు తీసుకొచ్చారు.
ఈ ప్రశ్నకి సమాధానంగా ఓ ఇంట్రెస్టింగ్ వెర్షన్‌కి మూడ్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ డైలమాకి సమాధానం నేడు వెల్లడిస్తామని టీమ్ చెప్పడంతో.. అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
బాహుబలి ఫ్రాంచైజ్‌కి ఇప్పటికీ ఫాలోయింగ్ తగ్గలేదు అనే విషయం ఈ అప్డేట్ చుట్టూ ఏర్పడిన హైప్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు వచ్చే కొత్త వెర్షన్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో తెలుసుకోవాలంటే.. మరికొద్ది గంటల వేచి చూడాల్సిందే.