వారందరినీ అరెస్టు చేస్తే సోషల్ మీడియా చెత్తకు చెక్!

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని అంటారు పెద్దలు. తమ ఐడెంటిటీ తెలియకుండా తప్పుడు పోస్టులు పెట్టి రాజకీయంగా తమ ప్రత్యర్థులను అసభ్యంగా దూషించడానికి ఇవాళ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నకిలీ ఐడీలతో సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేసుకుని చెలరేగిపోవడం మాత్రమే కాదు.. నకిలీ ఐపీలతో కూడా చెలరేగడం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అనే ముసుగులో విషం కక్కుతున్న దుర్మార్గులు రాజకీయ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాల మీద అభిప్రాయాలు చెప్పడం లేదు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మరియు వారి కుటుంబసభ్యుల మీద అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు. హోంమంత్రి అనితను కూడా వదలిపెట్టడం లేదు. అయితే ఈ అసహ్య పోస్టుల రూపకర్తలను పట్టుకోవడం కొంత కష్టంగా మారుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను ఏపీలో కాకుండా తెలంగాణ, కర్ణాటక మరియు విదేశాలలోని కొందరితో ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయా ప్రాంాల్లో తయారుచేయించి.. అక్కడ నకిలీ ఐపీ అడ్రసుల ద్వారా.. వాటిని సోషల్ మీడియా గ్రూపుల్లోకి వాట్సప్ గ్రూపుల్లోకి పంపుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా బాస్ అయిన సజ్జల భార్గవ రెడ్డికి కూడా పంపుతున్నట్టు పోలీసులు గుర్తించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అలా నకిలీ ఐపీ అడ్రసులనుంచి తొలి పోస్టు ఇంటర్నెట్ లోకి వెళ్లడం వలన.. ఎగ్జాక్ట్ గా ఎవరు వాటిని తయారుచేశారో కనిపెట్టడం పోలీసులకు కొంత కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆయా తప్పుడు పోస్టులు వైరల్ కావడానికి దారితీసేలా వాటిని ఫార్వర్డ్ చేసే ప్రతి ఒక్కరినీ కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టాలి. ఫార్వర్డ్ లు చేసే ప్రతి ఒక్కరూ నకిలీ ఐపీలను కలిగి ఉండడం అనేది అంత ఈజీ కాదు. అంత యాక్సెసిబిలిటీ, అంత వెసులుబాటు ఉండదు. కాబట్టి.. ఫార్వర్డ్ చేసే లైక్ చేసే, షేర్ చేసే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయడం జరగాలి. దీని వల్ల కలిగే తొలి ప్రయోజనం- తప్పుడు పోస్టుల వ్యాప్తి (సర్కులేషన్) ఆగిపోతుంది. వ్యాప్తి చెందించే వాళ్లు లేనప్పుడు పోస్టులు తయారుచేసేవారికి విలువ ఉండదు. వారి గ్రూపులో వారి భావజాలం ఉన్నవారే ఉంటారు. చేసిన కొత్త పోస్టులు వారే చూపుకుంటారు.. ఆనందిస్తారు. కానీ దానివల్ల పార్టీకి లాభముండదు. కొత్తవాళ్లకు చేరేలా చేయడానికి మాత్రమే సోషల్ మీడియా కార్యకర్తలతో షేర్ చేయిస్తుంటారు. కేవలం అరెస్టులే కాకపోయినప్పటికీ.. షేర్ లు జరగకుండా ఏ చర్యలు తీసుకున్నా సరే.. సమాజానికి మంచి జరుగుతుంది.

చంద్రబాబునాయుడు కొత్త చట్టాలు తయారుచేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా పోస్టు పెట్టిన వారిది తప్పు.. షేర్ చేసిన వారిది తప్పు కాదు అన్నట్టుగా చట్టాలున్నాయి. ఇప్పుడు పెట్టిన వారు దొరకడం లేదు. అతిజాగ్రత్తలు తీసుకుంటున్నారు గనుక! ఇప్పుడు షేర్ చేసిన ప్రతివారినీ నేరస్తులుగా గుర్తించేలా కొత్త చట్టాలు తయారైతే అప్పుడు సోషల్ మీడియా విపరీత పోకడలను కొంతమేర కట్టడి చేయడం వీలవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories