తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి సందD, ధమాకా సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుని ముందుకు సాగిపోతుంది. గత ఏడాది రెండు నెలలకి ఓ సినిమా చొప్పున అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ విజయాన్ని అందుకోలేదు. ఈ ఏడాది మహేష్ తో యాక్ట్ చేసిన ‘గుంటూరు కారం’ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
దీంతో శ్రీలీల పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆమెకు ‘పుష్ప 2’ లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. శ్రీలీల చేసిన ఫస్ట్ ఐటెం సాంగ్ ఇది. ఈ పాట చేయడం శ్రీలీలకి బాగానే కలిసొచ్చిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ‘కిసిక్’ అనే పదం దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపుతుంది. నార్త్ లో కూడా శ్రీలీల పేరు మారుమోగిపోతుంది.
దీంతో శ్రీలీలకు బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ చేయాలంటూ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ క్రమంలో శ్రీలీల ఇక నుంచి ఐటెం సాంగ్స్ చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్లో యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తే చాలని, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా అది హీరోయిన్ గా అయితే ఓకే కానీ, ఐటెం సాంగ్స్ అయితే చేయనని నిర్మాతలకు నిర్మొహమాటంగా చెబుతుందంట.
ప్రస్తుతం ఈ టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక శ్రీలీల త్వరలోనే నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ మూవీతో పాటూ రవితేజతో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు కూడా ప్రస్తుతం శ్రీలీల ఖాతాలో ఉన్నాయి.