ఆ రోజు ఎప్పటికీ మరచిపోలేను!

తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తరువాతే ఎవరైనా అనడంలో అతిశయోక్తి లేదు.  తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో  కూడా తనదైన ముద్ర వేసిన ఆమెతో తనకున్న కొన్ని మధుర జ్ఙాపకాలను అయితే మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

ఇటీవల జరిగిన సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిరు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పునాది రాళ్లు సమయంలో 1978 ఫిబ్రవరి నెలలో నరసింహరాజు గారు సావిత్రి గారితో సినిమా చేయబోతున్నాను అని చెప్పినపుడు నా ఒళ్ళు అంతా జలదరించింది.

నేను ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటి రెండు రోజుల్లోనే అంతా గొప్ప నటితో పరిచయం ఏర్పడడం తనని తాను చిరంజీవిగా పరిచయం చేసుకున్నప్పుడు ఆవిడ శుభం అని చెప్పారని అలా తర్వాత రోజు షూటింగ్ మధ్యలో వర్షం వచ్చినపుడు చిన్న జల్లు కురుస్తుంది.  ఆ సమయంలో ఎవరికీ ఏమీ తోచనపుడు సావిత్రి గారే అందరికి తన గురించి చెప్తూ చిరంజీవి అనే ఈ అబ్బాయి డాన్స్ బాగా చేస్తాడు అని పిలిచి చెయ్యమన్నారని తెలిపారు.

అలా చెప్పడమే ఆలస్యం  నా టేప్ రికార్డర్ తోనే పాట పెట్టి వర్షం లో డాన్స్ చేయడం మొదలు పెట్టాను.  ఆ సమయంలోనే కాలు జారి కింద పడినప్పటికీ నాగు పాములా ఏదో క డాన్స్ చేసేసానని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత సావిత్రి గారు చెప్పిన మాటలు ఎప్పటికీ తను మర్చిపోనని ఆయన అన్నారు.

‘నాకు బాగా నచ్చావయ్యా భవిష్యత్తులో గొప్ప నటుడివి అవుతావు అన్నారు. నీలో ఎంతో స్ఫూర్తిని చూశానని చెప్పిన మాటలు నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చినట్టు అనిపించింది’ అని చిరంజీవి తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories