స్టార్ నటుడి కూతురిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ తన నటనతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది వరలక్ష్మి శరత్ కుమార్. అంతే కాకుండా.. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భాష ఏదైనా సరే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే త్వరలో ‘శబరి’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని అనిల్ దర్శకత్వం వహిస్తుండగా.. మహేంద్రనాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ మే 3వ తేదీన రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి.. తన వ్యక్తిగత జీవితం గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
సినిమా గురించి చెప్తూ.. ‘‘శబరి’ సినిమా తల్లీ కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సింగిల్ మదర్ తన కూతరుకి ఎలాంటి లోటు తెలియకుండా పెంచాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో తన బిడ్డకి ఎవరైనా ఆపద తలపెట్టాలని ప్రయత్నిస్తే.. తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది.. కూతురుని ఎలా కాపాడుకుంటోంది అనేది స్టోరీ. ప్రధానంగా ఓ మూవీ అంశాలు కథను మలుపు తిప్పుతాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘తాను బాల్యంలోనే లైంగిక వైధింపులకు గురైనట్లు. అదే తన జీవితంలో మర్చిపోలేని గాయం. అయితే.. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది మానసిక పరిస్థితుల గురించి పక్కన వాళ్లకి, రిలేటివ్స్‌కు, ఫ్రెండ్స్‌కు చెప్పుకోలేరు. ఎందుకంటే ఎవరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు కాబట్టి థెరపిస్ట్ ఉంటే చాలా బెటర్. కుటుంబసభ్యులతో నీ సమస్యల గురించి మాట్లాడితే మనల్నే జడ్జ్ చేస్తారు. అదే థెరపిస్ట్‌తో మాట్లాడితే మనల్ని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే.. థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి నయం చేసుకోవడం ముఖ్యం’ అంటూ తెలిపింది వరలక్ష్మి.