అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హిస్టారికల్ డ్రామా చిత్రం మహారాజ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై విడుదల కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో జూన్ 21న విడుదలైంది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది.
ఇందులో జునైద్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చూపించిన కిషోరి పాత్రలో నటించిన షాలిని పాండే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ గా నటించిన షాలిని…ఈ మూవీలో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది.
ఈ క్రమంలోనే ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడుతూ..అలాంటి సన్నివేశాల్లో నటించడం అంత సులువు కాదని షాలిని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో శృంగార పరమైన సీన్ ఒకటి ఉండగా దాని గురించి ఓ ఇంటర్వ్యూలో షాలిని కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.
ఈ సినిమాలో ఓ శృంగారభరితమైన సన్నివేశంలో యాక్ట్ చేశా..ఆ సీన్ షూట్ చేసే ముందు నేను బయటకు పారిపోయాను..ఎందుకంటే అప్పుడు చాలా ఒత్తిడిగా అనిపించిందని షాలిని అన్నారు. అలాంటి వాతావరణం, చీకటి ఉన్నప్పుడు తనకు భయం ఎక్కువని పేర్కొంది. ఆమె అందుకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగినట్లు తెలిపింది. ఆ సమయంలో దర్శకుడే అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇచ్చారని, అప్పుడు ఆ సీన్ పూర్తి చేయగలిగినట్లు షాలిని వివరించింది.