ఆ విషయంలో చరణ్ మీద సర్వ హక్కులు నావే! టాలీవుడ్ స్టార్స్ లో గుర్రపు స్వారీ అనే ప్రస్తావన వస్తే మొదటిగా మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించేది. అయితే తన తర్వాత ఆ రేంజ్ స్టైల్, స్వాగ్ ని మ్యాచ్ చేసింది మాత్రం తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని గ్యారంటీగా చెప్పుకోవచ్చు. అయితే చరణ్ కి గుర్రపు స్వారీ మీద చాలా పట్టు ఉన్న విషయం తెలిసిందే.
తన రెండో సినిమా లోనే గుర్రపు స్వారీతో “మగధీర”లో అందరిని తన గుర్రపు స్వారీతో కట్టిపడేశాడు. ఇక అక్కడ నుంచి మొన్న ఆర్‌ఆర్‌ఆర్ లో కూడా అలరించగా తాజాగా మావెరిక్ డైరెక్టర్ శంకర్ కాంబోలో చేస్తున్న బిగ్గెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్” లో కూడా తెల్లటి గుర్రంపై కనిపించి అందర్ని ఆశ్చర్యానికి గురి చేసాడు. అయితే మగధీర, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల్లో రాజమౌళి చరణ్ ని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు.
ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా సాలిడ్ లుక్స్ తో కనిపిస్తుండగా ఈ ట్రైలర్ లాంఛ్ లో జక్కన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ గుర్రపు స్వారీ సీన్స్ చేస్తే కేవలం నా సినిమాల్లో మాత్రమే చెయ్యాలని నీతో ఆ ఒప్పందం అంతా రాయించుకుంటాను అంటూ ఫన్ గా మాట్లాడుతూ దర్శకుడు శంకర్ కి సరదాగా సారీ చెప్పారు. దీంతో చరణ్ గుర్రపు స్వారీ అంటే జక్కన్నకి ఎంత మక్కువ అనేది అర్ధం అవుతుంది.