బాలీవుడ్లో గ్రీక్ గాడ్‌గా పేరుగాంచిన హృతిక్ రోషన్, మన టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా వార్ 2. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది. దాంతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇటీవల చిత్ర యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేసింది. అయితే టీజర్ చూసిన తర్వాత ఎక్కువ మంది ఒక్కటే విషయంపై అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అదే ఈ టీజర్లో కనిపించిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పనితనం అంచనాలకు తగినట్టుగా లేదన్న అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అయాన్ ముఖర్జీ గతంలో బ్రహ్మాస్త్ర అనే విజువల్‌గా అద్భుతమైన సినిమాను రూపొందించారు. ఆ సినిమాతో ఆయన చూపించిన గ్రాఫికల్ వండర్ ఇప్పటికీ చాలామందిని ఆకట్టుకుంటోంది. అందుకే వార్ 2 విషయంలో కూడా అదే రేంజ్లో వుంటుందనుకుని ప్రేక్షకులు భారీగా ఎదురు చూశారు. కానీ టీజర్ మాత్రం అంచనాలను అందుకోలేదని కామెంట్స్ వస్తున్నాయి.