వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా..!

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్రపంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ 2025 ప్రారంభ‌మైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స‌మ్మిట్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ న‌టులు ఆమిర్ ఖాన్‌, అక్షయ్ కుమార్, మోహ‌న్‌లాల్ వంటి వారంతా వచ్చారు. వీరికి నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు.

ఇక ముంబయి వేదికగా జరిగిన ఈ ‘వేవ్స్’ చిరు మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.చిరంజీవి మాట్లాడుతూ. ‘ చిన్నతనంలో నేను డ్యాన్స్ చేసి నా కుటుంబం, స్నేహితులను ఎంటర్‌టైన్ చేసేవాని. అలా నటనపై మొదలైన ఆసక్తి నన్ను చెన్నై వెళ్లేలా చేసింది. కానీ నేను అడుగు పెట్టే సమయానికి ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఇప్పటికే పలువురు సూపర్ స్టార్స్ ఉన్నారు కదా.

ఇంకా నేనేం చేయగలను? అని అనుకునేవాడిని. ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న. అలా 1977లో నటనలో శిక్షణ పొంది మేకప్ లేకుండా సహజంగా నటించాలని మిధున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్ఫూర్తి గా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ, నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్న. నా కెరీర్‌కు అది చాలా ప్లేస్ అయ్యిందని తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories