ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు!

ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు! బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్‌ కి సంబంధించి పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఐతే, ఆ వీడియోలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, అవన్నీ ఏఐ టెక్నాలజీతో క్రియేట్‌ చేసిన డీప్‌ ఫేక్‌ వని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది. ఇంతకీ, విద్యాబాలన్‌ ఏం మాట్లాడింది అంటే.. ‘సోషల్‌మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ మధ్యకాలంలో నాకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, అవన్నీ ఏఐ జనరేటెడ్‌వి’ అని విద్యాబాలన్‌ తెలిపింది. విద్యాబాలన్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అందులోని కంటెంట్‌ నన్ను బాధ పెట్టింది. సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేసేముందు దయచేసి వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఒక్కోసారి ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి’ అని విద్యా బాలన్‌ చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories