ఆయన పై నాకు క్రష్ ఉంది! పొడుగు సుందరి మీనాక్షి చౌదరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో మీనాక్షి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ ఎవరో చెప్పేసింది. మీనాక్షి మాట్లాడుతూ.. ‘స్కూల్ టైంలో మా స్కూల్ టీచర్ అంటే నాకు చాలా క్రష్ ఉండేది.
నిజానికి నా ఒక్కదానికే కాదు, మా స్కూల్ లో ఉండే అమ్మాయిలందరికీ అతనిపై క్రష్ ఉండేది. నేను కూడా ఆ వయసులో అతనిని ఇష్టపడినట్లు చెప్పుకొచ్చింది. మీనాక్షి తన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. ‘జీవితంలో అందరికి ఎవరో ఒకరి మీద క్రష్ ఉంటుంది.
మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే కథతో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ మీనాక్షి తెలిపింది. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మీనాక్షి. అడవి శేష్ నటించిన ‘హిట్ 2’ మీనాక్షికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది.