మళ్లీ తెలుగు సినిమా చేస్తా అనుకోలేదు!

సీతారామంతో సీతామహాలక్ష్మిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యింది నటి మృణాల్‌ ఠాకూర్‌. ఆ సినిమా చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ పడిన కష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తెలుగు సరిగా రాకపోవడం వల్ల తాను రోజూ ఏడ్చేదానిని అని చెప్పుకొచ్చారు. తెలుగులో ఉన్న డైలాగులను ఇంగ్లీషులో  రాసుకొని నైట్‌ మొత్తం ప్రాక్టీస్‌ చేసేదాన్ని అంటే చెప్పారు. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించేదని దీంతో ఇక తెలుగు సినిమాల్లో నటించొద్దని అనుకున్నానని మృణాల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా తరువాత  ‘హాయ్ నాన్న’తో మరో మంచి హిట్ అందుకున్న మృణాల్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’తో  ప్రేక్షకులను పలకరించేందుకు ఇంకోసారి సిద్ధమయ్యారు. విజయ్ దేవకరొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  ఈ సినిమాలో కథానాయికగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటి సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఎప్పటికైనా మహారాణి పాత్రలో నటించాలని నా చిన్నప్పటి కల. అందుకే సీతారామం సినిమా చిత్ర యూనిట్ సంప్రదించగానే.. ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పా. సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. భాష రాకపోతే నటించడం చాలా కష్టం. తెలుగు రాకపోవడం వల్ల రోజూ ఏడ్చేదాన్ని’ అని మృణాల్‌ తెలిపారు.‘తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని.. రాత్రంతా ప్రాక్టీస్‌ చేసేదాన్ని.

హిందీ, మరాఠీల్లో కంటే.. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. సీతారామం సినిమానే నా మొదటి, చివరి ది ఇదే అని  షూటింగ్‌ జరిగేటప్పుడు దుల్కర్‌ సల్మాన్‌తో చెప్పాను. ఇక తెలుగులో అస్సలు సినిమా చేయనన్నాను. అందుకు దుల్కర్‌ నవ్వారు. ఈ సినిమా తర్వాత నీకు తెలుగులో అవకాశాలు ఎక్కువ వస్తాయని నాతో అన్నారు. దుల్కర్‌ చెప్పిందే నిజమైంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ కష్టాన్నంతా మర్చిపోయా. ఇప్పుడు తెలుగు చాలా ఈజీగా ఉంది’ అని మృణాల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories