ఇది అసలు అనుకోలేదుగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు తన తాజా భారీ సినిమా “డాకు మహారాజ్” సినిమాలో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ్య తేజని టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఎంట్రీ ఇప్పించేందుకు అల్రెడీ ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కాకుండా మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా మోక్షజ్ఞ్య కోసం ఇపుడు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎవరితోనో కాదు కల్కి 2898 ఏడీ అనే సినిమాతో 1000 కోట్లకి పైగా వసూళ్లు అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఉండనుందని ఓ టాక్‌ వినపడుతుంది.

అలాగే ఈ మూవీని  కూడా కల్కి 2898 ఏడీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారే నిర్మాణం వహించనున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ కాంబో ని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories