నన్ను ప్రేక్షకులు మర్చిపోతారనే భయం ఉంది!

సమంత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాను అని చెప్పింది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటూ తన చిత్రాలను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే అసలు ఇండస్ట్రీలో మాత్రం సామ్‌ పని అయిపోయిందని చెప్పుకుంటున్నారు. అక్కినేని ఇంటి కోడలిగా తప్పుకున్నప్పటి నుంచి కొత్త సినిమాలు ఏవి కూడా సామ్‌ చేతికి రావడం లేదు.

అసలు ఇప్పట్లో సమంత సినిమా వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. అయితే సామ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎందుకుంటే ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం నాకు ఎప్పుడూ ఉంటుందని సామ్‌ అంది. చాలా సినిమాల్లో నటిగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ నేను నటిగా చేశాను. ఎందుకంటే ప్రతి సినిమా పోస్టర్‌ పై నేను ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి అంటూ చెప్పుకొచ్చింది.

అందుకు తగిన కష్టం పడ్డాను కాబట్టే..ప్రతి నెల నాదొక సినిమా వచ్చేంది. అప్పుడు కచ్చితంగా మీ అందరి దృష్టి నా మీద ఉండేది. కానీ అందరూ ప్రతి నటిలో ఒక ఆలోచనను క్రియేట్‌ చేస్తారు. హీరోయిన్ అంటే కెరీర్‌ తక్కువుగా ఉంటుందని ఫిక్స్‌ అయ్యేలా చేస్తారు. ఎక్కువగా బ్రేక్‌ తీసుకోలేమని అంటుంటారు. ఎంత సేపూ కంటికి కనిపించేలా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు నటిగా మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.

ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ… అన్ని సినిమాలను తనకు నచ్చి చేయలేదని సమంత చెప్పుకొచ్చింది. సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నాను అని చెప్పడం  సులభమే కానీ ఈ సంవత్సరం పాటు ప్రేక్షకులకు కనిపించకపోతే కచ్చితంగా మర్చిపోతారు.

ఆ భయం నాలో ఎప్పుడూ ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. నేను ప్రస్తుతం ఎక్కడ కూడా నిలకడగా ఉండడం లేదు. నేను ఈ భయాన్ని అధిగమించాలి. నేను పాత వార్తను అయిపోతాను అనే భయాన్ని దగ్గరకు రానివ్వకూడదు. మంచి పాత్రలు కోసం ఎదురు చూడాల్సిందే అంటూ సూక్తులు చెప్పింది. అన్ని అవకాశాలు నా ఎదురుగా వచ్చేవరకు ఎదురుచూస్తాను’’ అంటూ సామ్‌ తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories