“అమరన్” నుంచి హైబ్రిడ్‌ పిల్ల పోస్టర్‌ వచ్చేసింది!

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో  ఒకరైన శివ కార్తికేయన్ హీరోగా , లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు మహేంద్రన్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ మూవీ  “అమరన్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి బజ్ నెలకొనగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందిస్తూ ఉన్నారు.

అలా తాజా గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.  మరి సాయి పల్లవి ఈ సినిమాలో ఇందు రెబాక వర్గీస్ అనే పాత్రలో కనిపించనుండగా కొన్ని నిజ జీవిత విజువల్స్ తో పాటుగా సాయి పల్లవి పాత్రని చూపించడం బాగుందని తెలుస్తుంది.

అలాగే ఈ వీడియోలో మ్యూజిక్ కూడా ఇంపుగా ఉండగా శివ కార్తికేయన్ తో మంచి కెమిస్ట్రీ ఈ సినిమాలో కనిపించేలా ఉందని టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి అయితే అమరన్ నుంచి సాయి పల్లవి ఫ్యాన్స్ కి బ్యూటీఫుల్ ట్రీట్ ని అందించారని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తుండగా ఈ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ గా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories