టాలీవుడ్లో చర్చకు కేంద్రంగా మారిన సినిమాల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర కూడా ఒకటి. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించిన ఓటీటీ డీల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కుబేర సినిమా డిజిటల్ హక్కులు రూ.50 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. ఓటీటీ రైట్స్ ఇంత భారీ స్థాయిలో అమ్ముడవడం వల్ల సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయింది.
కుబేరకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్టార్స్ కాంబినేషన్, మ్యూజిక్, బడ్జెట్, ఇంకా ఓటీటీ రైట్స్ కలిపి ఈ సినిమా మీద ఆసక్తి రెట్టింపైంది.