మెగా ఫోన్‌ పడుతున్న హృతిక్‌ రోషన్‌!

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘క్రిష్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు రాకేష్ రోషన్ తెరకెక్కించిన ఈ సినిమాతో హృతిక్ రోషన్ దేశవ్యాప్తంగా సాలిడ్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్స్ రావడం, అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం మనం చూశాం.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో సీక్వెల్ ‘క్రిష్-4’ రూపంలో రాబోతుంది. అయితే, ఈ సినిమాతో హృతిక్ రోషన్ హీరోగా మాత్రమే కాకుండా తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా కూడా మారుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వయంగా అనౌన్స్ చేశారు దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటున్నాయి.

మొత్తానికి మన ఇండియన్ సూపర్ హీరో యాక్షన్‌తో పాటు డైరెక్షన్ కూడా చేయబోతున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories