ముద్దు సీన్లు ఎలా తీస్తారు? సినిమాలో నిజంగానే రొమాన్స్‌ చేసుకుంటారా?

చిన్నప్పటి నుంచి ఓ డౌట్‌ చాలామందిని వేధిస్తుంటుంది. పెద్దాయక కూడా ఆ డౌట్ అలానే ఉంటుంది. సినిమాలో హీరోహీరోయిన్లు గాఢంగా ముద్దులు పెట్టుకుంటారు. అయితే ఇది రియల్‌గానే పెట్టుకుంటారా లేదానన్న అనుమానం చాలామందికలో ఉంటుంది. కొంతమంది ఇదంతా గ్రాఫిక్స్‌ అని చెబుతుంటారు. మరికొంతమంది ఏమో ఇదంతా రియల్‌ అని చెబుతారు. నిజానికి రెండూ సరైనా సమాధానాలు కావు. ఇదంతా సంబంధిత నటీనటులపైనా ఆధారపడిన విషయం. పలువురు నటులు ఈ ముద్దు సీన్లకు ఒప్పుకోరు. అలా ఒప్పుకోకపోవడమన్నది వారి వ్యక్తిగత విషయం. దర్శకనిర్మాతాలు ఈ విషయంలో నటీనటులను ఫోర్స్ చేయాకూడదు. అయితే సీన్‌కు తగ్గట్టుగా ముద్దు పెట్టుకోవాల్సి వస్తే డైరెక్టర్లు అల్టెర్‌నేట్‌ ఆప్షన్‌ చూసుకుంటారు. ముద్దు పెట్టుకోకుండానే పెట్టుకున్నట్టు చూపించే ట్రిక్‌ ఉంటుంది. అదేంటో తెలుసుకోండి.

వెండితెరపై ముద్దు పెట్టుకోవడం అనేది ఇప్పుడు అంత ప్రత్యేకమైన విషయం కాకపోయినా, దాని గురించి ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. ఫేక్‌ కిస్సింగ్‌ సీన్స్‌ను త్రీకరించడానికి వీఎఫ్ఎక్స్ (విజువల్ రిప్రజెంటేషన్) ఉపయోగిస్తారు. ఇలాంటి సన్నివేశాల్లో చాలా వరకు క్రోమా అంటే ఆకుపచ్చ కర్టెన్ (కర్టెన్)ను వెనుక భాగంలో ఉపయోగిస్తారు.  ముద్దు పెట్టుకోవాల్సిన నటులకు ఒక వస్తువును ఇస్తారు. వారిద్దరూ ఈ వస్తువుకు ముద్దు పెడతారు. తర్వాత ఎడిటింగ్‌లో ఆ వస్తువును వారిద్దరి మధ్య నుంచి తొలగిస్తారు. అప్పుడు ఇద్దరూ రియల్‌గా ముద్దుపెట్టుకున్నట్టే కనిపిస్తుంది.

ముద్దు సన్నివేశాన్ని చీకట్లో చిత్రీకరించినా దాని లైటింగ్ నటీనటుల ముఖంపై కాంతి ప్రతిబింబించేలా ఉంచుతారు. కాబట్టి రాత్రి పూట ముద్దు సన్నివేశం అయినా, సాయంత్రం అయినా, ఉదయం అయినా, పొలంలో అయినా, భవనంలో అయినా, ఓడలో అయినా సినీ నటుల ముఖాలు ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో మెరుస్తూనే ఉంటాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories